దేశంలో ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పేరుతో కొత్త స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ప్రవేశపెట్టింది. మిగిలిన స్కీమ్స్ కంటే ఎక్కువ రాబడిని అందించేందుకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. ఈ క్రమంలో మారిన రూల్స్ గురించి ఖాతాదారులు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంది. ప్రముఖ సుకన్య సమృద్ధి యోజనతో సహా జాతీయ చిన్న పొదుపు పథకాల కింద సక్రమంగా తెరిచిన పొదుపు ఖాతాలను క్రమబద్ధీకరించడానికి ఆర్థిక వ్యవహారాల శాఖ ఇటీవల కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. సుకన్య సమృద్ధి యోజనలో నియమాలు అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి వస్తాయి. అకౌంట్ ఓపెనింగ్‌లలో వ్యత్యాసాలను సరిచేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్గదర్శకాల్లో ముఖ్యమైన అప్‌డేట్‌లలో ఒకటి గ్రాండ్ పేరెంట్స్ తెరిచిన సుకన్య సమృద్ధి ఖాతాలకు సంబంధించినది. స్కీమ్ కింద కొత్తగా తీసుకొచ్చిన మార్పుల ప్రకారం ఇకపై చట్టపరమైన సంరక్షకులు లేదా సహజ తల్లిదండ్రులు తెరవని ఖాతాలు ఇప్పుడు మార్గదర్శకాలకు అనుగుణంగా తప్పనిసరిగా సంరక్షక బదిలీ చేయాల్సి ఉంటుంది. గతంలో తాతలు ఆర్థిక భద్రత కోసం తమ మనవరాలు కోసం ప్రముఖ సుకన్య సమృద్ధి ఖాతాలను తెరిచేవారు. అయితే ఇప్పుడు చట్టపరమైన సంరక్షకుడు లేదా సహజ తల్లిదండ్రులు మాత్రమే ఈ ఖాతాలను తెరవగలరు, నిర్వహించగలరు.
కొత్త నిబంధనల ప్రకారం మార్పులు చేయటానికి కొన్ని ముఖ్యమైన పత్రాలను కలిగి ఉండాలి. ముందుగా ఒరిజినల్ అకౌంట్ పాస్‌బుక్ కలిగి ఉంటుంది. దీనికి తోడు సదరు బాలిక బర్త్ సర్టిఫికెట్ వయస్సు , రిలేషన్ షిప్ రుజువుగా దోహదపడుతుంది. ఆడపిల్లతో సంబంధానికి చట్టపరమైన పత్రాలు వంటి పత్రాలు కలిగి ఉండాలి. కొత్తగా సంరక్షకులుగా నమోదు కోసం తల్లిదండ్రులు లేదా సంరక్షకలు ప్రభుత్వం జారీ చేసిన పత్రాలను సమర్పించేందుకు రుజువుగా కలిగి ఉండాలి. పైన పేర్కొన్న అన్ని పత్రాలతో సంబంధిత అధికారులను కలిసి కొత్త మార్గదర్శకాల ప్రకారం ఖాతాలో అవసరమైన మార్పులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది. కేంద్రం స్కీమ్ కింద కొత్తగా తెచ్చిన మార్పులు ఒకరి పేరుపై ఉన్న బహుళ ఖాతాలను మూసివేసేందుకు సహాయపడనుంది. సంరక్షక బదిలీ అవసరంతో పాటు, స్కీమ్ నిబంధనలను ఉల్లంఘించి తెరవబడిన బహుళ ఖాతాల సమస్యను కూడా మార్గదర్శకాలు పరిష్కరిస్తాయి. అంటే ఒకే ఆడపిల్ల కోసం రెండు కంటే ఎక్కువ ఖాతాలు తెరిచినట్లయితే, అదనపు ఖాతాలు వెంటనే మూసివేయబడతాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇకపై ప్రతి కుటుంబం కేవలం రెండు ఖాతాలను మాత్రమే తెరిచేందుకు అర్హులుగా చెప్పుకోవచ్చు.