ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. నిపుణుల పర్యవేక్షణలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ 67, 69 నెంబర్ గేట్లకు మరమ్మతు పనులు సాగుతున్నాయి. బ్యారేజ్ 69వ గేటు వద్ద పడవ ఢీకొని కౌంటర్ వెయిట్ దెబ్బతిన్న విషయం తెలిసిందే.నిపుణులు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. చీఫ్ ఇంజినీర్ తోట రత్నకుమార్ ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, డ్యామ్ సేఫ్టీ చీఫ్ ఇంజినీర్‌గా రత్నకుమార్ ఉన్నారు. అలాగే ఇరిగేషన్ శాఖ అడ్వైజర్ కె.వి.కృష్ణారావు కూడా మరమ్మతు పనులు పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ సీతానగరం పీడబ్ల్యూ వర్క్‌షాప్ రిటైర్డ్ ఇంజినీర్ కె.వి.కృష్ణారావు పర్యవేక్షణలో పనులు సాగుతున్నాయి. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఈఈ ఇంజినీర్ విజయసారథి మరమ్మతు పనులను పర్యవేక్షిస్తున్నారు.