అనధికారికంగా మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. క్రోసూరు మండలంలోని బాలెమర్రు గ్రామంలో ఎస్ఐ నాగేంద్రరావు మద్యం విక్రయిస్తున్న సాహెబ్ను అదుపులోకి తీసుకొని అతని వద్ద 35 క్వార్టర్ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ. గ్రామాల్లో ఎక్కడైనా మద్యం, గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa