ఎగువ నుంచి వస్తున్న వరదతో కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం అప్పన్నపాలెం బ్రిడ్జిపై నుంచి వరద ప్రవాహం ప్రవహిస్తోంది. ఈ ఉధృతి మరింత పెరిగితే బ్రిడ్జి పూర్తిగా మునిగే అవకాశం ఉంది.
దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ రూట్లో వాహనరాకపోకలు నిలిపివేశారు. మొత్తం 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఏలేళ్వరం వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు.