అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ టెక్సాస్‌లోని ఓ కార్యక్రమంలో భారత్ గురించి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. ఇతర దేశాల్లో భారతదేశాన్ని అవమానించే అలవాటు రాహుల్‌కు ఎప్పటినుంచో ఉందని విరుచుకుపడ్డారు.
భారతదేశం పరువు తీసేందుకే రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని మండిపడ్డారు. ఆరెస్సెస్ విధానాల గురించి తెలుసుకోవాలంటే రాహుల్ లాంటి వారికి ఎన్నో జన్మలు ఎత్తాల్సివస్తోందన్నారు.