విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొంటే ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలుగుతామని చంద్రబాబు పేర్కొన్నారు. మనది తుఫాన్లు అధికంగా ఉండే ప్రాంతమని.. దానికి అనుగుణంగా సమర్థవంతంగా ఎదుర్కొనేలా వ్యూహం సిద్ధం చేసుకోవాలన్నారు. వర్ష సూచన ఉన్న జిల్లాల అధికారులను ముందుగానే అలెర్ట్ చేయడం వల్ల ప్రాణ నష్టం తప్పిందని సీఎంకు ఆయా జిల్లాల అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలు, ఈస్ట్, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతామారామరాజు, కాకినాడ జిల్లాల్లో ముందస్తు చర్యలతో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని ఆయా జిల్లాల కలెక్టర్లు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్లు అప్రమత్తత ఉండాలని.. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు, వాగులు, వంకల పరిస్థితిపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.