భారీ వర్షాలతో గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి, కిర్లంపూడి మండలాల్లో ఏలేరు వరద తీవ్రత కొనసాగుతోంది. వరద ఉధృతికి 25 వేల ఎకరాలు నీట మునిగాయి.మూడు మండలాల్లో 23 గ్రామాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది. 216వ జాతీయ రహదారిపై పిఠాపురం గొల్లప్రోలు మధ్య మూడు చోట్ల ఏలేరు వరద నీరు ప్రవహిస్తోంది. ఏలేరు ఇతర అనుబంధ పంట కాలువలకు పది చోట్లకి పైగా గండ్లు పడ్డాయి. గొల్లప్రోలు పట్నంలోని మార్కండేయపురంలోకి ఏలేరు వరద నీరు ప్రవేశించాయి. గొల్లప్రోలు పట్టణ శివారులో ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై కూడా ఏలేరు వరద నీరు ప్రవహిస్తోంది. గొల్లప్రోలు పట్టణ శివారులోని వేరుశెనగ మిల్లులోకి వరద నీరు ప్రవేశించింది.ఏలేరు ఒకవైపు .. శుద్ధ గడ్డ మరోవైపు ముంచెత్తడంతో పంట పొలాల్లో భారీగా ముంపుపెరిగింది. గొల్లప్రోలు జగనన్న కాలనీ సూరంపేటలకు వెళ్లే రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది.