ప్రకాశం బ్యారేజీలోకి బోట్లు కొట్టుకొచ్చిన ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బోట్లు కౌంటర్ వెయిట్లను తాకడంతో ప్రమాదం తప్పిందని చెప్పారు.
అదే డ్యామ్ పిల్లర్లను తాకి ఉంటే పెను ప్రమాదం జరిగేదని వ్యాఖ్యానించారు. దాని ద్వారా లక్షలాది మంది ప్రాణాలు పోయేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని ఏం చేయాలో ప్రజలే చెప్పాలన్నారు.