ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరీ ఎమోషనల్ ట్వీట్చేశారు. ‘‘ఎంతోమంది రాజకీయ నాయకులతో పోరాడిన మా ఆయన ప్రజా జీవితంలో.. మొదటిసారిగా ఆయనపై ఎన్నో కుట్రలు చేసి, అరెస్టు చేసి, లేనిపోని అబద్దాలు ఆడుతుంటే.. నిజం గెలవాలని జనాన్ని అర్థించాను. ఊరూ వాడా ఏకమై, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారంతా కదిలి వచ్చి నిజాన్ని గెలిపించారు. నిజాన్ని నిలబెట్టిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.