రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో కాలువలు, డ్రెయిన్లు, చెరువులు, రిజర్వాయర్లు, ఏటి గట్ల పరిస్థితిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, రిజర్వాయర్లు, ఏటి గట్లు, కాలువలను వెంటనే గుర్తించాలని మంత్రి నిమ్మల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యుద్ధప్రాతిపదికన గండ్ల మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు.