ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపుతో వరద బాధితులకు భారీగా నిత్యవసరాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2024, 05:07 PM

విజయవాడ వరద బాధితులను ఆదుకోవటం కోసం ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపుతో దాతలు పెద్దఎత్తున ముందుకు వచ్చారు. భారీగా నిత్యవసరాలు,దుప్పట్లు,చీరలు దాతలు ఎమ్మెల్యే కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ. ఒక్క పిలుపుతో పశ్చిమ నియోజకవర్గములోని దాతలు పెద్ద ఎత్తున ముందుకు రావటం అభినందనీయమని, దీనికి తానూ వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. 15 లక్షల రూపాయల నిత్యావసరాలను, దాదాపు 2000 కుటంబాలకు అందేటట్లు, వీటిని ఒక కిట్ల మాదిరిగా తయారు చేసి బుధవారం విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పంపిణి చేయటం జరుగుతుంది. సాటి మనిషికి కష్టమంటే,వారికి అండగా మేము ఉంటాము అని ముందుకు రావటం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ముత్తియని రాజేష్, ములక సత్య వాణి రెడ్డి,మాదాల శైలజ,ఉప్పుటూరి శ్రీనివాసరావు,రత్న,మానం పద్మ శ్రీరామ్ బాబు, నేపాకా పద్మ, పేరం అనిత తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com