ప్రపంచంలోనే అతి చిన్న పార్కు ఒకటి ఉంది. ఇది గిన్నిస్ రికార్డులకు కూడా ఎక్కింది. USAలోని ఒరెగాన్ ఉన్న పోర్ట్‌ల్యాండ్‌లో ఈ పార్క్ ఉంది. ఈ పార్క్ పేరు ‘మిల్ ఎండ్స్ పార్క్’ (Mill Ends Park). దీనిని మొదటిసారిగా 1948లో పార్కుగా ప్రకటించారు. 1976లో ఈ పార్క్ ప్రపంచంలోనే అతి చిన్న పార్కుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది. ఈ చిన్న పార్క్ కేవలం 2 అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇందులో ఒకే ఒక్క మొక్క ఉంది.