ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఫేమ్ అవ్వడం కోసం రీల్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రీల్స్ చేస్తున్న సమయంలో అనుకోని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఓ మహిళ చెరువు గట్టుపై ఉన్న మట్టిపెళ్లపై నిల్చొని రీల్ చేసింది.
ఈ క్రమంలో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కిందపడి.. దొర్లుకుంటూ చెరువులోని నీటి దగ్గరకు వెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.