లక్ష్మీనర్సుపేట మండలం దుబ్బపాడు తురకపేట రహదారిలోని కడపలవాని గెడ్డ వద్ద.. బుధవారం ప్రమాద హెచ్చరిక బోర్డును అధికారులు ఏర్పాటు చేశారు. వర్షాలకు గెడ్డపై నుండి నీరు ప్రవహిస్తుండడంతో.. మండల ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు రాకపోకలు నిషేధిస్తూ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీవో ఆర్.కాళీప్రసాద్ తెలిపారు. ప్రజలు గమనించివలిసిందిగా ఆయన కోరారు.