వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సీతారాం ఏచూరి దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని చెప్పారు. అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన సీతారాం ఏచూరి కోలుకుంటారని భావించానని తెలిపారు. ఆయన మరణం బాధాకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల ప్రాథమిక హక్కుల కోసం బలంగా పోరాడుతూ అజ్ఞాతంలోకి వెళ్లారని తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఎన్నో ప్రజా సమస్యలను సభ ముందుకు తీసుకువచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారాన్ని అందుకున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. విదేశాంగ విధానం, ఆర్థిక అంశాలు, పారిశ్రామిక, వాణిజ్య విధానాలపై తన ఆలోచనలకు అక్షర రూపం ఇస్తూ వ్యాసాలు రాశారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు