మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాస్ వార్నింగ్ ఇచ్చారు, ‘ఖబడ్దార్ జగన్మోహన్ రెడ్డీ నోటి కొచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం. జగన్ రెడ్డికి 11 సీట్లు ఎందుకిచ్చామా అని ప్రజలు బాధపడుతున్నారు. 31 క్రిమినల్ కేసులున్నా నువ్వా సీఎం చంద్రబాబు గురించి మాట్లాడేది..? వరద బాధితుల పరామర్శకు మనసురాని జగన్ రెడ్డి జైళ్లకు, శవాల దగ్గరకు పరుగులు పెడతాడ’’ అని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆరోపణలు చేశారు.