ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన కింద సోలార్ విద్యుత్ కనెక్షన్లు రాయితీపై అందిస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ పథకం వలన గృహ వినియోగదారులకు అతి తక్కువ విద్యుత్ బిల్లు వస్తుందని, ఇంటి కప్పుపై కనీసం 10 చ. మీటర్లు లేదా 100 చ. అడుగుల స్థలంలో 1 కిలోవాట్ సామర్ధ్యం కలిగిన్ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చని జెసి తెలిపారు.