విజయవాడ రైల్వేస్టేషన్‌కు మరో ఘనత దక్కింది.. ఎన్‌ఎస్‌జీ-1 హోదాను సొంతం చేసుకుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ తర్వాత ఈ హోదా సాధించిన రెండో స్టేషన్‌గా విజయవాడ నిలిచింది. విజయవాడ రైల్వే స్టేషన్ వార్షికాదాయం రూ.500 కోట్లు అధిగమించి ఈ ఘనతను సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని ఈ రైల్వేస్టేషన్ దేశంలోని టాప్ 28 స్టేషన్లలో ఎలైట్ గ్రూప్‌లో చేరింది.
ఈ కొత్త విధానం 2017-18లో ప్రవేశపెట్టారు.. రూ.500 కోట్ల కంటే ఎక్కువ వార్షికాదాయం లేదా 2 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న స్టేషన్‌కు ఎన్‌ఎస్‌జీ-1 హోదా ఇస్తారు. గతంలో విజయవాడ రైల్వే స్టేషన్‌కు ఎన్‌ఎస్‌జీ-1 హోదా కొద్దిలో చేజారింది. అప్పుడు విజయవాడ స్టేషన్ రెండు ప్రమాణాలలో తక్కువగా ఉండటంతో ఎస్‌ఎస్‌జీ–2 హోదా మాత్రమే వచ్చింది. మళ్లీ ఐదేళ్ల తరువాత తాజా సమీక్షలో విజయవాడ రైల్వేస్టేషన్ రూ.528 కోట్ల ఆదాయం వచ్చింది.. దీంతో ఎన్‌ఎస్‌జీ-1 హోదా దక్కింది.
ఈ అరుదైన గుర్తింపు దక్కడంపై విజయవాడ రైల్వే స్టేషన్ ఆనందం వ్యక్తం చేశారు డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్. విజయవాడ డివిజన్‌కు ప్రతిష్టాత్మక ఎన్‌ఎస్‌జీ–1 హోదా రావటం గర్వకారణమని.. వ్యాపార, వాణిజ్య పరంగా డివిజన్ ఎంతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్నారు. ప్రయాణికుల అవసరాల మేరకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.
మరోవైపు విజయవాడలోని దుర్గాఘాట్‌లో నవహారతుల ట్రయల్ రన్‌ను నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో దుర్గాఘాట్‌లో నవహారతులు నిత్యం కృష్ణవేణి మాతకు ఇచ్చేందుకు ఏర్పాట్లను వైదిక కమిటీ సభ్యులు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అయితే దుర్గా ఘాట్‌లో ప్రస్తుతం కేవలం నవ హారతులకు సంబంధించి ఐదుసెట్లు మాత్రమే ఉన్నాయి. మరో నాలుగు సెట్లు తొమ్మిది హారతులు తయారు చేేయించనున్నారు. ఈ హారతుల్ని తొమ్మిది మంది రుత్వికులు ఏక కాలంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ హారతుల్లో ఓంకారం, నాగ, సూర్య, చంద్ర, పంచ, సింహ, కుంభ, నక్షత్ర, ఏక ఉన్నాయి.. వాటిని భక్తులు తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు