వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో సెల్ఫీ తీసుకుని మహిళా కానిస్టేబుల్‌ను చిక్కుల్లో పడ్డారు. గుంటూరులో జిల్లా జైలు దగ్గర బుధవారం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌తో సెల్ఫీ తీసుకున్నారు.. జైలులో మహిళా కానిస్టేబుల్ ఆయేషాబానుకు ఛార్జి మెమో ఇస్తామని జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బుధవారం జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్‌రెడ్డిని వైఎస్ జగన్ పరామర్శించారు.. అనంతరం జైలు బయట వచ్చిన తర్వాత జగన్‌తో కానిస్టేబుల్ ఆయేషాబాను తన కుమార్తెతో వచ్చి సెల్ఫీ తీసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కాగా.. విధి నిర్వహణను పక్కన పెట్టి ఆమె ఇలా చేయడంపై సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై జైలు సూపరింటెండెంట్ రఘు ఈ అంశంపై స్పందించాల్సి ఉంది.
వైఎస్ జగన్‌తో సెల్ఫీ దిగిన హెడ్ కానిస్టేబుల్ ఆయేషాబానుది అనంతపురం జిల్లా. ఆమె కూతురితో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. అక్కడ ప్రెస్‌మీట్ జరుగుతున్న సమయంలో దూసుకొచ్చారు.. 'నేను మీ అభిమానిని.. అందుకే సెల్ఫీ తీసుకుంటాను' చెప్పారు. జగన్ కూడా ఓకే చెప్పడంతో ఇద్దరు కలిసి సెల్ఫీ తీసుకున్నారు. విధుల్లో ఉన్న సమయంలో.. అది కూడా జగన్ అభిమాని అనడంతో ఈ విషయం హైలైట్ అయ్యింది. ఈ సెల్ఫీ తర్వాత జైలు అధికారులు ఈ అంశంపై స్పందించి.. హెడ్ కానిస్టేబుల్‌కు ఛార్జి మెమో ఇస్తామంటున్నారు.
మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి.. ఉదయం 10:30 గంటలకు పిఠాపురం చేరుకుని అక్కడి నుంచి మాధవపురం వెళ్లనున్నారు.. ఏలేరు వరద బాధిత ప్రాంతాలను పరిశీలిస్తారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడి, యు.కొత్తపల్లి మండలం నాగులపల్లికి వెళతారు. ఆ తర్వాత రమణక్కపేటకు వెళ్లి అక్కడ బాధితులతో మాట్లాడనున్నారు. అనంతరం అక్కడ నుంచి బయల్దేరి ితిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని పార్టీ కార్యాలయం తెలిపింది.