ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంకులకు వరుసగా 5 రోజులు సెలవులు

national |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 11:23 AM

బ్యాంకు కస్టమర్స్​కి అలర్ట్​! సెప్టెంబర్​ 14 నుంచి 18 వరకు దేశవ్యాప్తంగా అనేక బ్యాంక్​లకు వరుసగా ఐదు రోజుల పాటు సెలవు ఉండనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్​లో బ్యాంకు సెలవుల లిస్ట్​ని తెలుసుకుని కస్టమర్లు అందుకు తగ్గట్టు ప్లాన్​ చేసుకోవడం ఉత్తమం. ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రాంతీయ, జాతీయ, వారాంతపు సెలువులు ఉన్నాయి. సెలవుల షెడ్యూల్ కోసం మీరు మీ స్థానిక బ్యాంక్ బ్యాంచ్​ లేదా యాప్ నోటిఫికేషన్లను చెక్​ చేయాల్సి ఉంటుంది.మొత్తంమీద, భారతదేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులకు సెప్టెంబర్ 2024లో కనీసం 14 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. అందుకు అనుగుణంగా మీ బ్యాంకు పనులు ప్లాన్ చేసుకోవడం మంచిది.


నగదు అత్యవసర పరిస్థితుల కోసం, అన్ని బ్యాంకులు వారాంతం లేదా ఇతర సెలవులతో సంబంధం లేకుండా వారి ఆన్​లైన్ వెబ్సైట్లు, మొబైల్ బ్యాంకింగ్ సేవల యాప్స్​ని నిర్వహిస్తాయి - నగదు ఉపసంహరణ కోసం మీరు ఏ బ్యాంకు ఎటిఎంలను అయినా యాక్సెస్ చేయవచ్చు. ఇక సెప్టెంబర్​ 14 నుంచి ఐదు రోజుల పాటు బ్యాంక్​ సెలవుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..


బ్యాంకులకు వరుస సెలవులు..


సెప్టెంబర్ 14 - రెండవ శనివారం / ఓనం - భారతదేశం / కేరళ
సెప్టెంబర్ 15 - ఆదివారం / తిరువోణం - భారతదేశం / కేరళ
సెప్టెంబర్ 16 - ఈద్-ఎ-మిలాద్ (సోమవారం) - భారతదేశం అంతటా సెలవు


సెప్టెంబర్ 17 - గణేశ నిమజ్జనం (మంగళవారం)- అన్ని బ్యాంకులకు సెలవు


సెప్టెంబర్ 18 - శ్రీ నారాయణ గురు జయంతి (బుధవారం) - కేరళలోని బ్యాంకులకు సెలవు.


వీటితో పాటు, తరువాతి వారం కొన్ని రాష్ట్రాల్లో సెప్టెంబర్ 21 (శ్రీ నారాయణ గురు సమాధి - కేరళ), సెప్టెంబర్ 22 (ఆదివారం - పాన్-ఇండియా), మరియు సెప్టెంబర్ 23 (వీరమరణ దినం - హర్యానా) సెలవులు కూడా ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com