వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనే ఏపీకి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదన్నారు. 2020 ఖరీఫ్ నుంచి రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదని అన్నారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని తెలిపారు.