నిరుద్యోగులకు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ చేప్పింది. ఈ మేరకు సంస్థలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద గ్యాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు ఆర్ఆర్‌బీ 8,113 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.అందులో గూడ్స్ ట్రైన్ మేనేజర్‌కు 3,144, టికెట్ సూపర్‌వైజర్ 1,736, టైపిస్ట్ 1,507, స్టేషన్ మాస్టర్ 994, సీనియర్ క్లర్క్ 732 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో 18 నుంచి 36 ఏళ్ల లోపు వారు మాత్రమే ఉద్యోగాలకు అర్హులు. అసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మహిళా అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదటి దశలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లెవల్-1 ఉంటుంది. రెండో దశలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-2ను నిర్వహిస్తారు. అనంతరం సిల్క్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. గ్రాడ్యుయేట్ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థుల జీతం నెలకు రూ.29,900 ఉంటుంది.