వైసీపీ నేతల మీద అక్రమ కేసులు తాము పెట్టడం లేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. గతంలో ఆ పార్టీ నేతలు చేసిన పాపాలే వెంటాడుతున్నాయని అన్నారు. వైసీపీ నేతలు గతంలో చేసిన తప్పులపై కేసులు పెట్టి విచారిస్తున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి వివరించారు.గతంలో వరదలు వస్తే మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వారం రోజుల తర్వాత బయటకు వచ్చేవారని అన్నారు. విజయవాడలో వరద వస్తే తాము దగ్గరుండి పనిచేశామని తెలిపారు. కాలువ కట్టల మీద మట్టిని కూడా వైసీపీ నాయకులు దోచుకెళ్లారని అన్నారు. విజయవాడ వరద పాపం జగన్‌దేనని విమర్శిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జేసీబీ మీద 20 కిలోమీటర్లు తిరిగి ముంపు ప్రాంతాల్లో పరిస్థితిని చక్కదిద్దారని చెప్పారు. నాలుగు అడుగుల వరద నీటిలో కూడా చంద్రబాబు తిరిగారని అన్నారు. వరద బాధితులకు జగన్ ఇస్తామని చెప్పిన కోటి రూపాయలు ఎవరికి ఇచ్చారో చెప్పాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రశ్నించారు. బుడమేరుకు గండి పడిందని నిన్న ప్రచారం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని అన్నారు. మెడికల్ కాలేజీలు రద్దు చేయడం లేదని తెలిపారు. మెడికల్ కాలేజీల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు.