వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను న్యాయస్థానం పోలీసు కస్టడికి అనుమతి ఇచ్చింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి 17వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నం వరకు మంగళగిరి పోలీసులు రూరల్ స్టేషన్‌లో విచారించనున్నారు. తెలుగుదేశం ప్రధానకార్యాలయంపై దాడి కేసులో పోలీసులు విచారించనున్నారు. రెండు రోజులు విచారణ విచారణ జరగనుంది. ప్రస్తుతం నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైలులో ఉన్న విషయం తెలిసిందే. జిల్లా జైలు నుంచి పోలీసులు మంగళగిరి సీఎస్‌కు తరలించనున్నారు. మరోవైపు నందిగం సురేష్‌కు వైద్యులు బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు చేశారు. బీపీ, షుగర్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని తేల్చారు. కాగా భుజం నొప్పిగా ఉందని వైద్యులకు నందిగం సురేష్ తెలిపారు. కస్టడీ ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేస్తామని వైద్యులు తెలిపారు.