ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీని స్నేహ పూర్వక వాతావారణంలో తెలంగాణ నుంచి రప్పించేందుకు కృషి చేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కంచర్ల అచ్యుతరావుకి హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రిని సోమవారం విశాఖలో మర్యాదపూర్వకంగా కలిసిన కంచర్ల రాష్ట్రంలోని ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం చేపట్టబోయే కార్యాచరణను మంత్రికి వివరించారు.