వంటనూనెలు సలసల కాగుతున్నాయి. ఆ వేడిలో సామాన్యుడు విలవిలాడుతున్నాడు. శనివారం నుంచి వంటనూనె లీటరు ధర రూ.20ల వరకు పెరిగింది. పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనె, సోయానూనె ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం వంటనూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆ మరుక్షణమే రిటైల్ వినియోగదారులు లీటరుకు రూ.20 పెంచేశారు. దిగుమతి సుంకానికి అదనంగా 5శాతం స్టాండెడ్ సెస్, 10శాతం అగ్రికల్చర్ సెస్ యాడ్ అవుతుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.115 నుంచి 130 వరకు పెరిగింది. చిల్లర దుకాణాల్లో ఇంకో ఐదు రూపాయలు ఎక్కువగానే అమ్ముతున్నారు. పామాయిల్ ధర రూ.95 – 110కు పెరిగింది. వేరుశనగ రూ.145 నుంచి రూ.154 పెరిగింది. దీపారాధన ఆయిల్ రూ.108 నుంచి 121కి పెరి గింది. సన్‌ఫ్లవర్ 15 కేజీల టిన్ రూ.1,750 నుంచి రూ.2వేలకు ఎగబాకింది. పామాయిల్ డబ్బా రూ.1,520 నుంచి 1,720కు పెరిగింది. రైస్‌బ్రాన్ ఆయిల్ రూ.120 – 130కి పెరిగింది. ఒక్కసారిగా ధర పెరగడంతో వినియోగదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దిగుమతి సుంకం పెంచడంతో దళారులు రంగంలోకి దిగారు. ఉన్న ఆయిల్‌ను గొడౌన్స్‌లో నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించి ఇంకా ధరలు పెంచేందుకు పన్నా గాలు పన్నుతున్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నిర్వా కంతో అన్ని రకాల ధరలు విపరీతంగా పెరిగాయి. నిత్యావసర సరు కులు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరి గాయి. మరోవైపు తాజాగా వరదల కారణంగా కూరగాయల పంటలు దెబ్బతిని కూరగాయల రేట్లు పెరిగాయి. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా వంటనూనెల పై దిగుమతి సుంకం పెంచడంతో సామాన్యులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.