ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల పదో తేదీ నుంచి వివిధ పద్దతుల్లో బోట్ల తొలగింపునకు అధికారులు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే బ్యారేజ్ వద్ద చిక్కుకున్న పడవలు 80 టన్నుల బరువు ఉండటంతో అనేకసార్లు ఆటంకాలు ఎదురయ్యాయి. చివరకు కావడి మంత్రం వ్యూహంతో నిన్న (మంగళవారం) నీళ్ల అడుగున ఉన్న బోటును అధికారులు బయటకు తీశారు. భారీ బోటును నిన్న అర్ధరాత్రి గేట్ల వద్ద నుంచి దుర్గా ఘాట్ వరకు సిబ్బంది లాక్కెళ్లారు. మిగిలిన బోట్లు తీసేందుకు ఈరోజు (బుధవార) కూడా ఆపరేషన్ కొనసాగనుంది. మూడు రోజుల్లో అన్ని బొట్లు తొలగిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఎనిమిది రోజుల కష్టం తరువాత భారీ బోటు బయటకు రావడంతో అధికారుల్లో ఆనందం వెల్లివిరిసింది. కావడి మంత్రం వ్యూహం ఫలించడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద ఓ బోటు పైకి లేచింది. 40 టన్నులున్న భారీ బోటును అధికారులు బయటకు తీశారు. ఇంకా బ్యారేజీలో రెండు భారీ, ఒక మెస్తారు బోట్లు చిక్కుకుని ఉన్నాయి. సూయుజ్ గేట్ల వద్ద సేఫ్టీ వాల్ ఉన్న కారణంగా వ్యూహం మార్చారు. సేఫ్టీ వాల్ దెబ్బ తినకుండా వేరే విధానం అమలు చేసి బోట్స్ బయటకు తీయాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్న విధంగానే భారీ కార్గో బోట్లపై టన్ను బరువు ఉన్న గడ్డర్లను వెల్డింగ్ చేసి మునిగిన బోట్‌ను పైకి లేపారు. ఇసుక, నీరు చేరడంతో బోటు 100 టన్నుల బరువు పెరిగింది. దీంతో అధికారులు కొత్త వ్యూహంతో ఎట్టలేకలకు విజయవంతంగా ఒక బోటును బయటకు తీసుకొచ్చారు. మిగిలిన బోట్లను తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.