వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చీటెడ్ అకౌంటెంట్ అంటూ ఎద్దేవా చేశారు. చీటెడ్ అకౌంటెంట్‌గా పేరుగాంచిన జైలుపక్షి విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి హయాంలో పనిచేసిన ఎక్కువ మంది ఉన్నతాధికారులు, నాయకులు జైలు భయంతో సముద్రమార్గం, విమానయానం ద్వారా ఖండాతరాలు దాటి పారిపోతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో పనిచేసిన అధికారులంతా కేంద్ర కేబినెట్ సెక్రెటరీలుగా, సెంట్రల్ ఐటీ చీఫ్ కమీషనర్లుగా సేవ చేస్తూ ప్రజల్లో గౌరవం పొందుతున్నారని తెలిపారు. చంద్రబాబు కుటుంబానికి వైఎస్ కుటుంబానికి.... ఆదిశంకరాచార్యులుకి.. ఆటో శంకర్‌కు ఉన్నంత తేడా ఉందంటూ కనపర్తి శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు.