ఏపీలోని పల్నాడు జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నరసరావుపేటలోని హార్డ్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని వసతి గృహంలో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెం గ్రామానికి చెందిన పల్లపు జయలక్ష్మి (14)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో బాలిక కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa