ప్రభుత్వ పిలుపునకు స్పందించిన ఎందరో దాతలు వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. బుధవారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును పలువురు దాతలు కలిసి, సీఎంఆర్‌ఎఫ్ పేరుతో విరాళాల చెక్కులను అందజేశారు. వరద బాధితుల కోసం విరాళాలిచ్చిన దాతల్ని సీఎం చంద్రబాబు అభినందించారు. ఆల్ర్టాటెక్ సిమెంట్స్ అధినేత డాక్టర్ వసంతరావు పాలపల్లి రూ.2 కోట్లు, గీతం యూనివర్సిటీ తరఫున విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ రూ.కోటి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తన వ్యక్తిగత విరాళం రూ.5 లక్షలతో కలిపి, నియోజకవర్గ ప్రజల తరఫున రూ.83,44,624, భాగ్యనగర్ గ్యాస్ ఎండీ రామ్మోహన్‌రావు రూ.50 లక్షలు, స్టీల్ ఎక్స్‌ఛేంజ్ ఇండియా లిమిటెడ్ తరఫున మోహిత్ బన్సాల్ రూ.50 లక్షలు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, నియోజకవర్గ ప్రజలు కలసి రూ.35 లక్షలు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియేషన్ తరఫున డాక్టర్ విజయ్ కుమార్ రూ.20 లక్షలు, రవాణా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏపీఎ్‌సఆర్టీసీ హైర్ బసెస్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ఎస్ వెంకటేశ్వరరెడ్డి రూ.24 లక్షలు, గుంటూరుకు చెందిన సీఏ గడ్డిపాటి సుధాకర్ రూ.20 లక్షలు, మల్లవల్లి ఇండస్ర్టీస్ అసోసియేషన్ రూ.14.50 లక్షలు, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ తరఫున వై రవిబాబు రూ.10 లక్షలు, 108 ఎంప్లాయిస్ అసోసియేషన్ రూ.10 లక్షలు, ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ రూ.10 లక్షలు, రాయదుర్గం గార్మెంట్స్, స్పాంజ్ ఐరన్ ప్లాంట్స్ రూ.8.20 లక్షలు, మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో నెయ్యలకుల మత్స్యకారుల సంక్షేమ సంఘం రూ.6.50 లక్షలు, కిన్నెర ఫౌండేషన్ కిన్నెర మాల్యాద్రి రూ.5 లక్షలు, ఎస్‌ఏఎ్‌సఆర్ ఇన్‌ఫ్రా కే వెంకటరమణారెడ్డి రూ.5 లక్షలు చెక్కును సీఎంకు అందజేశారు.