అనంతపురం నగరం నేషనల్ పార్కు సమీపంలో సోమవారం టమాటా లోడ్ తో వెళ్తున్న ఐచర్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు గుత్తి మండలం అబ్బే దొడ్డి గ్రామానికి చెందిన దంపతులు హనుమంత రెడ్డి, రంగమ్మగా పోలీసులు గుర్తించారు. వారు అనంతపురంలో ఉంటున్న తమ కుమార్తెలను చూసి తిరిగి వస్తుండగా ఈ ఘటన ప్రమాదం జరిగింది. భార్యాభర్తల మృతి స్థానికంగా విషాదం నింపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa