యూపీలోని భాగ్‌పట్‌లో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించగా, హఠాత్తుగా వచ్చిన ఓ కోతుల గుంపు ఆ దారుణాన్ని అడ్డుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు బాలికకు మాయమాటలు చెప్పి ఓ పాడుబడిన ఇంటిలోకి తీసుకెళ్ళాడు.
అనంతరం ఆ పాపపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అదే సమయంలో కోతుల గుంపు అక్కడికి వచ్చి, అతడిపై దాడికి యత్నించాయి. వాటి ఆగ్రహానికి అతను భయపడి, చిన్నారిని వదిలేసి పారిపోయాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa