డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్స రానికి సంబంధించి తాత్కాలిక ప్రాతిపదికన సబ్జెక్ట్ కాంట్రాక్ట్ విధానంలో బోధన కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.సుజాత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీలోని ఇంజ నీరింగ్, సైన్స్, ఆర్ట్స్ కళాశాలల్లో పీజీ, యూజీ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఈనెల 30న ఉదయం పది గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈలో, ఈఈఈలో మూడు చొప్పున, సివిల్‌లో రెండు, మెకానికల్‌లో ఒక ఖాళీ ఉన్నట్లు తెలిపారు.
సైన్స్ కళాశాలలో ఫిజిక్స్‌లో రెండు, మైక్రో బయాలజీలో ఒకటి ఖాళీ ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్ట్స్ కళాశాలలో రూరల్ డెవలప్‌మెంట్, ఎంఎల్‌ఐఎస్సీ, ఐటెప్, సోషల్‌వర్క్, డీసీఎం ఎస్, అనలెటికల్ స్కిల్స్, సెల్ఫ్ డిఫెన్స్ ట్రయనర్ (మహిళలకు ప్రాధాన్యం)లో ఒక్కక్కటి చొప్పున, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎడ్యుకేషన్/స్పెషల్ ఎడ్యుకేషన్‌లో రెండు చొప్పున ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఈ ఖాళీలను మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన ఎంపికచేస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో పరిశీలించాలని సూచించారు.