ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి 13వ వార్డులో మంగళవారం ఉదయం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ అందిస్తున్న విధానము, కూటమి వంద రోజుల పాలనలో చేసిన వివిధ అభివృద్ధి పనులను వివరించి పాంప్లెట్లు పంపిణీ చేశారు.మున్సిపల్ కమిషనర్ బాలాజీ ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్, కూటమి శ్రేణులు, సచివాలయ అధికారులు పాల్గొన్నారు.