ఉపాధి కోసం వసల వెళ్లిన యువకుడు రైలు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాధ చాయంలో అలముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. జి.సిగడాం మండలం అనందపురం గ్రామానికి చెందిన డొప్ప ధనుంజయరావు (26) గుంటూరులోని ఓ కోల్డ్ స్టోరేజ్ (మిర్చియార్డ్)లో పని చేస్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చిన ధనుంజరావు.. తిరిగి గుంటూరు వెళ్లేందుకు ఆదివారం ఉదయం చీపురుపల్లి రైల్వే స్టేషన్లో ప్రశాంతి ఎక్స్ప్రెస్లో బయలుదేరాడు. ఈ క్రమం లో నెల్లిమర్ల చెంపావతి వంతెన వద్ద ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ విషయాన్ని ధనుంజ యరావుతోపాటు ఉపాధికి వెళ్తున్న అదే గ్రామానికి చెందిన పోతురాజు నారాయణ రావు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకుని రోధిస్తున్నారు. ధనుంజయరావుకు భార్య మంగమ్మ, ఇద్దరు పిల్లలు రెండేళ్ల పాప నిచిత, ఆరు నెలల బాబు విరాట్ ఉన్నారు. ఆమదాలవలస జీఆర్పీ పోలీసులు శవ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. అనంతరం చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.