ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారంతో ఫేమస్ అయిన కుమారి అంటీ రూ. 50 వేల విరాళం సోమవారం అందజేశారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి సీఎం చంద్రబాబుకు కుమారి ఆంటీ చెక్కు అందజేశారు. వరద బాధితుల సహాయార్థం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కుమారి అంటీ రూ. 50వేల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కుమారి అంటీ చేసిన కృషిని సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే రాము తెలిపారు.