ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవన్నీ డిలీట్ చేయండి.. మాజీ మంత్రి రోజా వార్నింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2024, 08:47 PM

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. రోజా యూట్యూబ్ ఛానెల్ ద్వారా పోల్ నిర్వహించారంటూ.. కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్రభుత్వ పాలన మీద, తిరుమల లడ్డూ వివాదంపైనా రోజా పోల్ నిర్వహించినట్లు కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రోజా కీలక ప్రకటన చేశారు. తనకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని రోజా సెల్వమణి స్పష్టం చేశారు. తన పేరు మీద ఉన్న ఛానెల్స్, అకౌంట్లు డిలీట్ చేయాలని హెచ్చరించాలు. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటూ మాజీ మంత్రి రోజా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.


"అందరికీ నమస్కారం. నా మిత్రులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు దయచేసి గమనించగలరు. నేను సామాజిక మాద్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండటానికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, థ్రెడ్స్ మాత్రమే వాడుతున్నాను. నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు. దయచేసి గమనించగలరు. నా పై ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన, జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటి. వెంటనే సదరు ఛానల్స్ నా పేరుపై ఉన్న అకౌంట్‌లను డిలీట్ చెయ్యాలని హెచ్చరిస్తున్నాను. లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నా అధికారిక వెరిఫైడ్ అకౌంట్(బ్లూటిక్ ఉన్న)లను మాత్రమే ఫాలో కాగలరని అభిమానులను కోరుకుంటున్నాను." అంటూ రోజా ట్వీట్ చేశారు.


మరోవైపు 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున పోటీచేసి.. రోజా ఓటమి పాలయ్యారు. వరుసగా రెండుసార్లు వైసీపీ తరుఫున పోటీ చేసి గెలుపొందిన రోజా.. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి వేవ్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగింది. దీంతో నగరి నుంచి హ్యాట్రిక్ కొట్టాలన్న రోజా ఆశలకు గండిపడింది. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధికార ప్రతినిధిగా రోజాను నియమిస్తూ.. వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. రోజాతో పాటుగా యాంకర్ శ్యామలను కూడా వైసీపీ అధికార ప్రతినిధిగా నియమించారు. తాజాగా తిరుమల లడ్డూ వివాదంపై ప్రభుత్వం తీరును విమర్శిస్తూ రోజా బలంగా వైసీపీ వాణి వినిపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com