తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కల్తీ చెయ్యబడిన నెయ్యిని కలపడం దారుణమని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి విమర్శించారు. వీరపునాయుని పల్లె మండలం సంగమేశ్వర ఆలయంలో జనసేన నాయకులు చేపట్టిన పాప ప్రక్షాళన దీక్షకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ పశ్చాతాప దీక్ష చేపట్టడం అభినందనీయమన్నారు. ఇలాంటి తప్పులు జరగకుండా సీఎం చంద్రబాబు చర్యలు చేపడుతున్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa