ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ అన్నారు. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రేపల్లె నగరంలోని ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు 50, 555 రూపాయల చెక్కును బుధవారం శివప్రసాద్ కు అందజేశారు. సీఎం సహాయనిధికి చెక్క అందించిన విద్యార్థులను ఉపాధ్యాయులను శివప్రసాద్ అభినందించారు.