సాగు చేసిన పంటలపై రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఓర్వకల్లు మండల వ్యవసాయాధికారి సుధాకర్ సూచించారు. మంగ ళవారం మండలంలోని హుశేనాపురం, ఉయ్యాలవాడ గ్రామాల్లో వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్ర మం నిర్వహించారు. కంది, మొక్కజొన్న, పత్తి, పొగాకు తదితర పంటలను పరిశీ లించారు.
పత్తిలో గులాబి రంగు పురుగు, కందిలో మచ్చల పురుగు, పొగా కులో వైరస్, తెల్లదోమ అధికంగా ఉందని, వాటి నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ అధికారి మదనగో పాల్, సర్పంచ చంద్రగోవర్థనమ్మ, ఎంపీటీసీ చిన్నమ్మ, టెక్నికల్ ఏవో అల్లి పీరా, రైతులు, ఏవో, ఏఈవోలు పాల్గొన్నారు.