కడప నగరంలోని దేవుని కడపలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుదర్శన్ రాయల్ ఇంటిపై జనసేన కార్యకర్తలు బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో దాడి చేశారు.
విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం ఎస్. బి. అంజాద్ భాషా, కడప నగర మేయర్ కే. సురేష్ బాబులు సుదర్శన్ రాయల్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పార్టీ తరఫున హామీ ఇచ్చారు.