రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం చంద్రన్నతోనే సాధ్యం అని తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు. గురువారం బి. కొత్తకోట మండలం బడి కాయల పల్లెలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు సాగుతుందని అన్నారు. 100 రోజుల్లో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడంతో ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల నోటి నుండే వచ్చిందన్నారు.