గాలేరు - నగరి ప్రాజెక్టును పూర్తిచేసి సికెదిన్నె మండలంలో ఉన్న గుర్రం గుంపు ప్రాజెక్టును నీటితో నింపాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
గురువారం చింతకొమ్మదిన్నె మండలం కొలుముల పల్లెలో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యేకి వినతిపత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రాజెక్టుకు నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని తెలిపారు.