ఉమ్మడి నెల్లూరు జిల్లా, పెళ్లకూరు మండలం, చిల్లకూరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాళహస్తి నుంచి నాయుడుపేటకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు ఎన్టీఆర్ జిల్లా వెంకటాపురం వాసిగా గుర్తించారు. క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa