రాష్ట్రంలో కౌలు రైతులకు పంట రుణాలు అందించడంలో మరింత మేలు జరిగేలా వచ్చే రబీ సీజన్ నుంచి ప్రత్యేక విధానాన్ని తీసు కొస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. పశ్చిమ గోదావరి కలెక్టరేట్‌లో గురువారం బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్షలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...... ‘వ్యవసాయ రంగంలో 80 శాతానికి పైగా కౌలు రైతులు సాగు చేస్తు న్నారని, అయినప్పటికీ వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలకు రూ.16 వేల కోట్లు రుణ లక్ష్యం కాగా, కౌలు రైతులకు అందులో కేవలం ఒకశాతం రూ.240 కోట్లు లక్ష్యానికి గాను కేవలం రూ.101 కోట్లు పంట రుణాలుగా అందిం చడం బాధాకరమైన విషయం.
గత ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీలో భూ యజ మాని అంగీకారం ఉండాలని పెట్టిన నిబంధనతో కౌలు రైతులకు రుణాలు అందిం చడంలో బ్యాంకర్లకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. 2014–19 టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 18 లక్షల మందికి పైగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తే , గత ప్రభుత్వం కేవలం 8 లక్షల మంది కౌలు రైతులకు మాత్రమే గుర్తింపు కార్డులు జారీ చేసింది. గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్ది భూ యజమాని అంగీకారంతో పని లేకుండా వ్యవసాయాధికారులు క్షేత్ర స్థాయిలో కౌలు రైతులను గుర్తించి భూ యాజమాన్య హక్కులకు భంగం కలుగకుండా గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. ఆ కార్డును పరిగణలోకి తీసుకుని బ్యాంకర్లు రుణాలు అందిస్తారు. చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వేత్తలకు రుణాలు అందించి జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి బ్యాంకర్లు సహకరిస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో రూ.16,500 కోట్ల లక్ష్యానికి గాను మొదటి త్రైమాసికంలో రూ.3,223 కోట్లు రుణాలుగా అందించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సెక్యూరిటీగా నాలా వంటి నిబంధ నలు లేకుండా వ్యవసాయ భూమిని అంగీకరించాలని రాష్ట్ర బ్యాంకర్ల కమిటీని కోరుతున్నాం. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా చేతి వృత్తుల వారికి బ్యాంకులు రుణాలు అందిస్తు న్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా ప్రైవేటు బ్యాంకులు సామాజిక బాధ్యతతో చిరు వ్యాపారులకు ముద్ర రుణాలు అందించాలి’ అన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు పాల్గొన్నారు.