నాసిరకం విత్తనాలతో ఉల్లి పంట పండక నష్టపోయానని కళ్యాణదుర్గం మండలం మానిరేవు గ్రామానికి చెందిన రైతు ఖాసిం శుక్రవారం విలేఖరులకు తెలిపారు. ఈ నెల 2న అనంతపురంలోని ఓ దుకాణంలో కిలో విత్తనాలు రూ. 1, 550లు చొప్పున 8కిలోలు రూ.12, 400లు వెచ్చించి కొనుగోలు చేసి పంట వేయగా నష్టపోయానని అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి తనకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.