ధర్మవరం పట్టణంలోని ఎన్డీయే కార్యాలయంలో నేషనల్ హైవేలు, రోడ్ అండ్ బిల్డింగ్స్ శాఖల అధికారులతో మంత్రి సత్యకుమార్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ధర్మవరంలో రహదారుల అభివృద్ధికి సంబంధించి వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా కదిరి గేట్ దగ్గర ఆర్వోబీ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ధర్మవరంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.