బకాయిలు చెల్లించక, సకాలంలో జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గోవాడ షుగర్ కార్మికుల, రైతుల సంక్షేమ నిధికి జనసేన పార్టీ తరఫున చోడవరం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పి వి ఎస్ ఎన్ రాజు చెరో లక్ష రూపాయలు చొప్పున విరాళాన్ని ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కును శనివారం జరిగిన సుగర్స్ మహాజనసభలో ఫ్యాక్టరీ చైర్మన్ అయిన కలెక్టర్ విజయ్ కృష్ణన్ కు అందజేశారు. దీంతో కలెక్టర్ జనసేన రాజుని అభినందించారు.