నార్పల సమీపంలోని జగనన్న కాలనీలో దళితులకు ఇంటి పట్టాలు మంజూరు. చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు రంగాపురం పుల్లప్ప తహశీల్దార్ అరుణకుమారిని కోరారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన మీ కోసం కార్యక్రమంలో విన్నవించారు.
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో కొన్న భూమిలో దళితులకు అన్యాయం జరిగిందని అన్నారు. అదే విధంగా కొందరు వైసీపీ నాయకులు అక్రంగా కబ్జా చేశారన్నారు. వాటిపై చర్యలు తీసుకుని పేదలకు ఇవ్వాలన్నారు.