పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. సోమవారం వడిశలేరులో బృందావనం హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్, వడిశలేరు పిరమిడ్ స్పిరిచువల్ ఆధ్యర్యంలో నిర్వహించిన వనసంరక్షణ మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. వాతావరణ కాలుష్యం నుంచి బయటపడేందుకు మొక్కలు నాటాలన్నారు. అనంతరం భజేన్నారాయణస్వామి గుడి వద్ద ఎమ్మెల్యే మొక్కలను నాటారు. వనసంరక్షణ ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నల్లమిల్లి విజయభాస్కరరెడ్డి ఆళ్ల బాబి, నీలపాల త్రిమూర్తులు, ఎలుగుబంటి సత్తిబాబు, ఉద్దండ్రావు శ్రీను పాల్గొన్నారు.